మేమూ మనుషులమే : కృతి
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. మీడియా ప్రవర్తన, సోషల్ మీడియా తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రోల్స్, గాసిప్స్ విడిచి సడెన్‌గా మంచితనం, పాజిటివిటీ గురించి మాట్లాడడం తనకు వింతగా అనిపిస్తున్నట్టు తెలిపింది. ‘సోషల్ మీడియా అనేది ఫేక్.. ఇది విషపూరితమైన ప్రదేశం.. ఒకరు చనిపోతే మేము ఎంత బాధలో ఉన్నా సరే.. రెస్ట్ ఇన్ పీస్ అని పబ్లిక్‌గా చెప్పకపోతే మీరు దీన్ని తప్పుగా భావిస్తారు. అంటే సోషల్ మీడియా అనేది రియల్ […]
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. మీడియా ప్రవర్తన, సోషల్ మీడియా తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రోల్స్, గాసిప్స్ విడిచి సడెన్‌గా మంచితనం, పాజిటివిటీ గురించి మాట్లాడడం తనకు వింతగా అనిపిస్తున్నట్టు తెలిపింది. ‘సోషల్ మీడియా అనేది ఫేక్.. ఇది విషపూరితమైన ప్రదేశం.. ఒకరు చనిపోతే మేము ఎంత బాధలో ఉన్నా సరే.. రెస్ట్ ఇన్ పీస్ అని పబ్లిక్‌గా చెప్పకపోతే మీరు దీన్ని తప్పుగా భావిస్తారు. అంటే సోషల్ మీడియా అనేది రియల్ వరల్డ్ అయిపోయింది. రియల్ వరల్డ్ ఫేక్ అయిపోయింది.. అంతేగా!’ అని ప్రశ్నించింది.
కొందరు మీడియా ప్రతినిధులు కనీసం సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడింది కృతి. ‘అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు ఎంత బాధలో ఉంటాం.. అలాంటి సమయంలో మేడం కొంచెం అద్దం దించండి.. మీ ఫోటో సరిగ్గా రావట్లేదు అని చెప్తున్నారు. అరే.. కొంచెం మానవత్వం ప్రదర్శించడం నేర్చుకోండని సూచించింది. గ్లామర్ ప్రపంచం, తారా లోకం పక్కన పెడితే మేము కూడా మనుషులమనే సంగతిని మరిచిపోకండి. జర్నలిజం విలువలను తెలుసుకుని ప్రవర్తించండి. మమ్మల్ని బతకనివ్వండి.. మీరూ బతకండి. మీరు బ్లైండ్‌గా రాసే విషయాలు.. ఒక వ్యక్తి మెదడును, జీవితాన్నే కాదు ఆ వ్యక్తి కుటుంబాన్ని కూడా ప్రభావితం చేయగలవని గుర్తుంచుకోండి. మీ ఒపీనియన్‌ను నిజంగా మార్చి.. నెగెటివిటీ పెంచే ప్రయత్నం చేయొద్దు’ అని కోరింది.
https://www.instagram.com/p/CBh0cg_A4Ru/?utm_source=ig_web_copy_link
‘ఆ అమ్మాయి ఇలా ఏడ్చింది.. అలా ఎందుకు ఏడవలేదు ? హేయ్ ఏడవొద్దు.. స్ట్రాంగ్‌గా ఉండండి.. ఇలాంటివి చెప్పకండి. ఏడవడం అనేది బలహీనత కాదు. ఏడవండి.. మీ బాధ తగ్గేలా అరవండి.. బాధ నుంచి ఉపశమనం పొందేందుకు మీకు నచ్చిన వారితో మాట్లాడండి. కుటుంబాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్లే మీ బలం.. సమస్య ఏదైనా వారే మీతో నిలబడతారు. జీవితాన్ని ఒక్కరే ఒంటరిగా జయించడం కష్టం’ అని తెలిపింది.