ఆ నటిని ‘ఫిమేల్ అమీర్ ఖాన్’ గా పిలుస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?
దిశ, సినిమా: కృతి సనన్, పంకజ్ త్రిపాఠి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిమీ’. ఈ మూవీలో అవివాహిత అయిన కృతి అద్దె గర్భం ఇచ్చిన తల్లిగా కనిపించడం కోసం 15 కిలోల బరువు పెరగడంతో నెటిజన్లు తనను ‘ఫిమేల్ అమీర్ ఖాన్’ గా పిలవడం ప్రారంభించారు. అయితే అలా పిలవడం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటి.. ‘దయచేసి అలా పిలిచి నన్ను ఒత్తిడికి గురి చేయవద్దు. నాది అమీర్ ఖాన్‌తో పోల్చే స్థాయికాదు. కానీ […]
దిశ, సినిమా: కృతి సనన్, పంకజ్ త్రిపాఠి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిమీ’. ఈ మూవీలో అవివాహిత అయిన కృతి అద్దె గర్భం ఇచ్చిన తల్లిగా కనిపించడం కోసం 15 కిలోల బరువు పెరగడంతో నెటిజన్లు తనను ‘ఫిమేల్ అమీర్ ఖాన్’ గా పిలవడం ప్రారంభించారు. అయితే అలా పిలవడం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటి.. ‘దయచేసి అలా పిలిచి నన్ను ఒత్తిడికి గురి చేయవద్దు. నాది అమీర్ ఖాన్‌తో పోల్చే స్థాయికాదు.
కానీ ఆ పాత్ర చేసినందుకు ప్రజలు అభినందిస్తే నాకు చాలా సంతృప్తిగా ఉంది’ అని తెలిపింది. ‘మిమీ’ కోసం బరువు పెరగడం ఒక సవాలుగా మారిందన్న నటి.. ఇక ఈ బరువు తగ్గేందుకు ఎలాంటి కఠినమైన వర్కౌట్స్ చేసిందో వీడియో షేర్ చేసింది. ఇక కృతిని ‘ఫిమేల్ అమీర్ ఖాన్’ ఎందుకు అంటున్నారంటే.. ‘దంగల్’ సినిమా కోసం అమీర్ కూడా తండ్రి పాత్ర కోసం బరువు పెరగడంతో ఈ విషయాన్ని లేవనెత్తారు నెటిజన్లు.
https://www.instagram.com/reel/CSTtT_4gzMw/?utm_source=ig_web_copy_link