అమ్మలాగ మరెవరూ బాధ పడకూడదు: కృతి సనన్

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ లాక్ డౌన్ కాలంలో గృహ హింస కేసులు పెరగడం పై ఆవేదన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ గృహ హింస కేసులు రెట్టింపు అయ్యాయి అనే వార్త విన్నాక నా హృదయం విచ్చిన్నం అయిందని బాధపడింది కృతి. కేవలం పంజాబ్ లోనే 700 కేసులు నమోదు అయ్యాయి అంటే… దేశం మొత్తం లో పరిస్థితి ఎలా ఉందో అని ఆందోళన వ్యక్తం చేసింది. రిజిస్టర్ కాని కేసులు ఇంకెన్ని ఉంటాయో ఆలోచిస్తే […]

Update: 2020-04-29 00:21 GMT

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ లాక్ డౌన్ కాలంలో గృహ హింస కేసులు పెరగడం పై ఆవేదన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ గృహ హింస కేసులు రెట్టింపు అయ్యాయి అనే వార్త విన్నాక నా హృదయం విచ్చిన్నం అయిందని బాధపడింది కృతి. కేవలం పంజాబ్ లోనే 700 కేసులు నమోదు అయ్యాయి అంటే… దేశం మొత్తం లో పరిస్థితి ఎలా ఉందో అని ఆందోళన వ్యక్తం చేసింది. రిజిస్టర్ కాని కేసులు ఇంకెన్ని ఉంటాయో ఆలోచిస్తే గుండె తరుక్కు పోతుందన్న కృతి… మీరు ఎలాంటి గృహ హింసను ఎదుర్కొంటున్న దయచేసి హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని కోరింది. మీ జీవితాన్ని మీరు మాత్రమే నియంత్రించగలరు… దయచేసి మీకోసం నిలబడండి. కారణం ఏదైనా సరే… ఒకరు మిమ్మల్ని శారీరకంగా బాధపెట్టడం మంచిది కాదు అని తెలిపింది.

ఈ సందర్భంగా గృహ హింసకు గురవుతున్న మహిళల పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉంటుందో వివరిస్తూ కవిత చదివి వినిపించింది. ఎప్పుడో 11వ తరగతిలో రాసిన ఈ కవితని ఇప్పుడు చెప్తున్నానన్న కృతి… ఈ కవిత రాసేందుకు కారణం మా అమ్మ అని చెప్పింది. నాన్న రోజు సాయంత్రం తాగొచ్చి అమ్మను కొట్టేవాడని… తన నుంచి విడిపోతే పిల్లలు ఏమై పోతారోనని అమ్మ అన్నీ భరిస్తూ వచ్చిందని తెలిపింది. ఆ టైంలో అమ్మ పడిన బాధను చూసి ఈ కవిత రాసుకున్న ట్లు చెప్పింది కృతి. కవిత రాసి చాలా కాలం అయినా… ప్రతీ అక్షరం గుర్తుందని… కారణం అమ్మ బాధను కళ్లారా చూడడమే అని తెలిపింది. పిల్లలు కోసమో, ఇంకేదైనా కారణం వల్లో మీరు రోజూ నరకం అనుభవించాల్సిన అవసరం లేదని.. హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేస్తే మీకు సహాయం అందుతుందని … మీ జీవితం బాగుపడుతుందని సూచించింది కృతి.

Tags:    

Similar News