'ప్రజల వల్లే పోలీసులు, వలంటీర్లకు కరోనా సోకింది'

విజయవాడ ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదని కలెక్టర్ ఇంతియాజ్ ఆరోపించారు. విజయవాడలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, కరోనా బారిన పడకుండా ఉండేలా విజయవాడ ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదని అన్నారు. కృష్ణలంక, ఖుద్దూస్‌నగర్ ప్రాంతాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. సామూహిక సమావేశాల్లో పాల్గొనడం వల్లే కేసులు ఎక్కువ అయ్యాయని ఆయన తెలిపారు. […]

Update: 2020-04-29 04:44 GMT

విజయవాడ ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదని కలెక్టర్ ఇంతియాజ్ ఆరోపించారు. విజయవాడలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, కరోనా బారిన పడకుండా ఉండేలా విజయవాడ ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదని అన్నారు.

కృష్ణలంక, ఖుద్దూస్‌నగర్ ప్రాంతాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. సామూహిక సమావేశాల్లో పాల్గొనడం వల్లే కేసులు ఎక్కువ అయ్యాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలను ఇకపై ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజల తీరుతో 13 మంది పోలీసులు, 12 మంది వలంటీర్లకు కరోనా సోకిందని ఆయన తెలిపారు.

కాగా, ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే మెజారిటీ కేసులు నమోదవుతున్నాయి. రాజధాని అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

tags: krishna district, ap, vijayawada, police march past, collector, imtiaz, cp, dwaraka tirumalarao

Tags:    

Similar News