యోగాతో రీచార్జ్ అవుతున్న కొత్తగూడెం పోలీసులు
దిశ, ఖమ్మం : పోలీసు ఉద్యోగం అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. పండుగలు, నేషనల్ హాలిడేలు, వారంతపు సెలవుల ఊసే ఉండదు. పొద్దంతా డ్యూటీ చేసి రాత్రి ఇంటికొచ్చాక తిని సేదతీరేలోపే స్టేషన్ నుంచి లేదా ఉన్నాతాధికారుల నుంచి కాల్ వచ్చిందంటే మళ్లీ పరుగెత్తాల్సిందే. ఎప్పుడెప్పుడు కంటి నిండా నిద్ర దొరుకుతుందా అని ఎదురుచూసే పోలీసులు లేకపోలేదు.విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికి అంటే అక్కడి వెళ్లే క్రమంలో సరైన సమయంలో తిండి, నిద్ర లేక చాలా మంది […]
దిశ, ఖమ్మం : పోలీసు ఉద్యోగం అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. పండుగలు, నేషనల్ హాలిడేలు, వారంతపు సెలవుల ఊసే ఉండదు. పొద్దంతా డ్యూటీ చేసి రాత్రి ఇంటికొచ్చాక తిని సేదతీరేలోపే స్టేషన్ నుంచి లేదా ఉన్నాతాధికారుల నుంచి కాల్ వచ్చిందంటే మళ్లీ పరుగెత్తాల్సిందే. ఎప్పుడెప్పుడు కంటి నిండా నిద్ర దొరుకుతుందా అని ఎదురుచూసే పోలీసులు లేకపోలేదు.విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికి అంటే అక్కడి వెళ్లే క్రమంలో సరైన సమయంలో తిండి, నిద్ర లేక చాలా మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ఈ యోగా తరగతులు మానసిక ప్రశాంతత కల్గిస్తాయనే ఉద్దేశ్యంతో భద్రాద్రి కొత్తగూడెం పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేశారు.తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా మంత్రం పఠిస్తున్నారు. శ్వాసమీద ధ్యాస పెడుతూ..ఆసనాలేస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.కిష్టయ్య ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కొత్తగూడెం హేమచంద్రాపురంలో శిక్షణనిస్తోంది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆన్‌లైన్ తరగతుల ద్వారా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కిష్టయ్య తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ వర్క్‌షాప్ మరో నాలుగు రోజులపాటు కొనసాగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్‌లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్ల ద్వారా ఈ ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారని చెప్పారు. మొదటి రోజు సుమారుగా 100 మంది సిబ్బంది ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.