ప్రభుత్వం ఉన్నది ఎందుకు.. కలెక్టర్‌ను ప్రశ్నించిన రైతులు
దిశ, కోటపల్లి: రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుంటే ప్రభుత్వం ఉన్నది ఎందుకని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరిని రైతులు ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరు కాగా రైతుల నుండి భారీ ఎత్తున నిరసన సెగ ఎదురైంది. మా భూములు వరిపంటకే అనుకూలంగా ఉంటాయని, ఇన్నాళ్ళు వరిపంట సాగు చేసిన భూముల్లో ఇకనుంచి ఇతర పంటలు సాగు చేయడం […]
దిశ, కోటపల్లి: రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుంటే ప్రభుత్వం ఉన్నది ఎందుకని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరిని రైతులు ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరు కాగా రైతుల నుండి భారీ ఎత్తున నిరసన సెగ ఎదురైంది. మా భూములు వరిపంటకే అనుకూలంగా ఉంటాయని, ఇన్నాళ్ళు వరిపంట సాగు చేసిన భూముల్లో ఇకనుంచి ఇతర పంటలు సాగు చేయడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం పెరగిన ధరలతో ఇతర పంటలు సాగుచేస్తే రైతులకు ఏం మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం వరి పంట సాగు చేయకూడదని కలెక్టర్ రైతులకు సూచించారు. వరిపంటను సాగు చేయకుండా ఇతర పంటలను సాగు చేయడం కన్నా, తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం ఉత్తమమని రైతులు కలెక్టర్ ఎదుట వాపోయారు. దీంతో చేసేదేం లేక కలెక్టర్ ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయారు.