ల్యాండ్ కోసం రాయలసీమ గ్యాంగ్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో రాయలసీమ వాసుల భూ స్థల వివాదం సంచలనం రేపుతోంది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి, కుమారుడు కొండారెడ్డి అనుచరులు తుపాకులు.. కత్తులతో బెదిరించి స్థలం కాగితాల పై సంతకం చేయించుకున్నారు. రూ. 14 కోట్ల ప్రాపర్టీ కోసం హైదరాబాద్‌లో నడిబొడ్డున ఈ గ్యాంగ్ వీరంగం సృష్టించారు. అసలేమైందంటే.. శివగణేష్‌కు చెందిన రెండెకరాల లిటికేషన్‌లో ఉంది. అయితే, ఈ వ్యవహారం సెటిల్‌మెంట్ చేయాల్సిందిగా కొండారెడ్డితో శివగణేష్ డీల్ కుదుర్చుకున్నాడు. సెటిల్‌మెంట్ చేస్తే ఎకరం […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో రాయలసీమ వాసుల భూ స్థల వివాదం సంచలనం రేపుతోంది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి, కుమారుడు కొండారెడ్డి అనుచరులు తుపాకులు.. కత్తులతో బెదిరించి స్థలం కాగితాల పై సంతకం చేయించుకున్నారు. రూ. 14 కోట్ల ప్రాపర్టీ కోసం హైదరాబాద్‌లో నడిబొడ్డున ఈ గ్యాంగ్ వీరంగం సృష్టించారు.
అసలేమైందంటే..
శివగణేష్‌కు చెందిన రెండెకరాల లిటికేషన్‌లో ఉంది. అయితే, ఈ వ్యవహారం సెటిల్‌మెంట్ చేయాల్సిందిగా కొండారెడ్డితో శివగణేష్ డీల్ కుదుర్చుకున్నాడు. సెటిల్‌మెంట్ చేస్తే ఎకరం భూమిని కొండారెడ్డికి ఇచ్చేందుకు తొలుత శివగణేష్ ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్థలం తన పేరుమీదుగా మార్పిడి చేయలేదని గత నెల 26న కొండారెడ్డి గ్యాంగ్ తుపాకులతో వచ్చి బెదిరించారు. ఇదే వ్యవహారంలో కొండారెడ్డి బంధువు రామచంద్రారెడ్డి కూడా సహకరించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు 15 మంది పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 452, 341,386,502, 120బీ కింద కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు.