కేసీఆర్‌ అది చేస్తే నేను కుడా ఆయనకు మద్దతు తెలుపుతా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దిశ, భువనగిరి: తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి‌లో వడ్లు కొనం అని ప్రకటించటం‌పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. కేంద్రం పేరు చెప్పి వడ్లను కొనను అని చెప్పటం దారుణం అని కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. కేసీఆర్‌కి చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని రైతు బాధ […]

Update: 2021-11-29 11:50 GMT

దిశ, భువనగిరి: తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి‌లో వడ్లు కొనం అని ప్రకటించటం‌పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. కేంద్రం పేరు చెప్పి వడ్లను కొనను అని చెప్పటం దారుణం అని కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. కేసీఆర్‌కి చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని రైతు బాధ పట్టించుకోకుండా ఓట్ల కోసం రెండు ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని అన్నారు.

కేసీఆర్‌కి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ‌లో జంతర్ మంతర్ దగ్గర రైతుల పక్షాన దీక్ష చెయ్యాలని ఆ దీక్షకు తాను కూడా మద్దతు తెలుపుతూ పాల్గొంటానని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చావునోట్లో తల పెట్టి వచ్చాను అని చెప్పుకుంటున్నారు అలాంటప్పుడు కేంద్రం‌పై ఎందుకు పోరాటం చెయ్యడం లేదు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. మూసి పరివాహక ప్రాంతం, సాగర్ ప్రాంతాలలో వరి తప్ప ఇంకేం పంటలు పండవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానికి ప్రకటన చేస్తే రైతుల పరిస్థితి ఏం కావాలి అని ఆవేదన వ్యక్తం చేసారు.

వారి ప్రకటనలతో రైతులు రోడ్లపైన పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనాల్సిందే అని అన్నారు. 5 లక్షల కోట్ల అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం 20 వేల కోట్లు కేటాయించలేని పరిస్థితిలో ఉంది అని అన్నారు. రాష్ట్రంలో 50 శాతం భూముల్లో వరి తప్ప ఇంకేం పండవు అని తెలిసి కూడా రైతుల పట్ల ఇలాంటి ఆంక్షలు విధిస్తుంది ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ కేంద్రం‌పై నింద నెట్టి వడ్లు కొనకుంటే ఊరుకునేది లేదు అని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News