కొమురం భీం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత..

దిశ, ఆసిఫాబాద్ రూరల్ : కొమురం భీం ప్రాజెక్ట్ రెండు గేట్లను శనివారం రాత్రి 9 గంటలకు ఎత్తనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి నీరు బయటకు వదులుతున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తడం వల్ల 5,600 క్యూసెక్కుల నీరు బయటకు వదిలివేయనున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.  

Update: 2021-09-25 10:13 GMT

దిశ, ఆసిఫాబాద్ రూరల్ : కొమురం భీం ప్రాజెక్ట్ రెండు గేట్లను శనివారం రాత్రి 9 గంటలకు ఎత్తనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి నీరు బయటకు వదులుతున్నామని అధికారులు పేర్కొన్నారు.

ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తడం వల్ల 5,600 క్యూసెక్కుల నీరు బయటకు వదిలివేయనున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

 

Tags:    

Similar News