కరోనాపై ధైర్యంగా పోరాడుదాం !
ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా సోకి.. ఇప్పటికే 5 వేల మందికి పైగా ప్రాణాలు తీసిన కరోనా వైరస్ ఇండియాలోనూ వేగంగా ప్రబలుతోంది. కోవిడ్ 19 @ కరోనా దెబ్బకు ఐపీఎల్ వాయిదా వేయగా.. దక్షణిఫ్రికాతో వన్డే సిరీస్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పోస్టు చేశాడు. ‘మనందరం ధైర్యంగా ఉండి కరోనాపై పోరాటం చేద్దాం. ఆ వైరస్ మరింతగా వ్యాప్తించకుండా […]
ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా సోకి.. ఇప్పటికే 5 వేల మందికి పైగా ప్రాణాలు తీసిన కరోనా వైరస్ ఇండియాలోనూ వేగంగా ప్రబలుతోంది. కోవిడ్ 19 @ కరోనా దెబ్బకు ఐపీఎల్ వాయిదా వేయగా.. దక్షణిఫ్రికాతో వన్డే సిరీస్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పోస్టు చేశాడు. ‘మనందరం ధైర్యంగా ఉండి కరోనాపై పోరాటం చేద్దాం. ఆ వైరస్ మరింతగా వ్యాప్తించకుండా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందాం’ అని పేర్కొన్నాడు.
వైరస్ పట్ల అప్రమత్తంగా ఉందాం.. చికిత్స కంటే ఆ వైరస్ రాకుండా నివారించడమే ముఖ్యం.. ప్రతీ ఒక్కరు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశాడు. టీమ్ ఇండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ కూడా కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుందాం అని ట్వీట్ చేశాడు. వైద్యులు సూచనలు పాటించి వైరస్ బారి నుంచి రక్షించుకుందాం అని పేర్కొన్నాడు.
tags : Coronavirus, Virat Kohli, Twitter, KL Rahul