కోహ్లీకి నెట్‌లో బంతులు విసరని కేల్ జేమిసన్.. ఎందుకో తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి నెట్స్‌లో బంతులు విసరడానికి ఆ జట్టు పేసర్ కైల్ జేమిసన్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. కైల్ జేమిసన్ వద్ద డ్యూక్ బ్రాండ్ బంతులు రెండు ఉన్నాయి. న్యూజీలాండ్ నుంచి వచ్చే ముందే వాటిని తనతో తెచ్చుకున్నాడు. ఆ బంతులను తనకు నెట్స్‌లో విసరాలని కోహ్లీ, కోరినా జేమిసన్ నిరాకరించాడట. దాని వెనుక పెద్ద కారణమే ఉన్నది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇండియా, న్యూజీలాండ్ జట్లు సౌతాంప్టన్‌లో […]
దిశ, స్పోర్ట్స్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి నెట్స్‌లో బంతులు విసరడానికి ఆ జట్టు పేసర్ కైల్ జేమిసన్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. కైల్ జేమిసన్ వద్ద డ్యూక్ బ్రాండ్ బంతులు రెండు ఉన్నాయి. న్యూజీలాండ్ నుంచి వచ్చే ముందే వాటిని తనతో తెచ్చుకున్నాడు. ఆ బంతులను తనకు నెట్స్‌లో విసరాలని కోహ్లీ, కోరినా జేమిసన్ నిరాకరించాడట. దాని వెనుక పెద్ద కారణమే ఉన్నది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇండియా, న్యూజీలాండ్ జట్లు సౌతాంప్టన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నాయి. న్యూజీలాండ్ టెస్టు జట్టులోని కేన్ విలియమ్‌సన్, ట్రెంట్ బౌల్ట్, కేల్ జేమిసన్ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్నారు. వీళ్లు నేరుగా ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. అయితే కివీస్ జట్టులోని కీలక బౌలర్ జేమిసన్ ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. దీంతో తనకు డ్యూక్ బంతులు విసరాలని కోహ్లీ కోరినా సరదాగా తిరస్కరించాడట. అయితే ఐపీఎల్‌లో ఉపయోగించే కూకాబుర్రా బంతులతో మాత్రం నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ తెలిపాడు.