శానిటైజర్ ఇవ్వలేదని.. డిపో మేనేజర్ సస్పన్షన్
దిశ, ఖమ్మం: ఖమ్మం బస్టాండ్‌లో ఆర్టీసీ సేవల తీరుపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బస్సుల వివరాలు, ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాలకు సంబంధించిన వివరాలను ఆర్ఎంను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిపోలో కండక్టర్‌కు తప్పని సరిగా హ్యాండ్ శానిటైజర్ ఇవ్వాలని, బస్సులో ప్రయాణికుల హ్యాండ్స్ శానిటైజ్ చేసిన తర్వాతనే టికెట్ ఇవ్వాలని సూచించారు. మాస్క్ లేకుంటే టికెట్ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి కోదాడ […]
దిశ, ఖమ్మం: ఖమ్మం బస్టాండ్‌లో ఆర్టీసీ సేవల తీరుపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బస్సుల వివరాలు, ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాలకు సంబంధించిన వివరాలను ఆర్ఎంను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిపోలో కండక్టర్‌కు తప్పని సరిగా హ్యాండ్ శానిటైజర్ ఇవ్వాలని, బస్సులో ప్రయాణికుల హ్యాండ్స్ శానిటైజ్ చేసిన తర్వాతనే టికెట్ ఇవ్వాలని సూచించారు. మాస్క్ లేకుంటే టికెట్ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి కోదాడ డిపో బస్సు ఎక్కారు. శానిటైజర్ ఏదంటూ కండక్టర్‌ను ప్రశ్నించగా డిపో మేనేజర్ పంపిణీ చేయలేదని చెప్పాడు. దీంతో వెంటనే సూర్యాపేట జిల్లా ఆర్ఎంతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. కండక్టర్‌కు శానిటైజర్ ఇవ్వని కారణంగా కోదాడ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని అన్ని బస్సులకు విధిగా శానిటైజర్ అందించాలని ఆదేశాలిచ్చామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. నిబంధనలు పాటించని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.