పీఏకి మంత్రి ముద్దులు.. లీకైన ఫోటోలు వైరల్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా తో దేశం మొత్తం వణికిపోతోంది. ఒకరిని మరొకరు ముట్టుకోవాలంటేనే భయపడుతున్నారు. అలాంటి సమయంలో ఒక మహిళను ముద్దాడాడు. అందులోను అతను  సామాన్యమైన వ్యక్తి కాదు. బాధ్యత కలిగిన పదవి లో ఉన్న మంత్రి. కరోనా ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో సోయమరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు. ఇంకేముంది ఆ ఫోటోలు కాస్తా లీక్ అయ్యి పేపర్ కి ఎక్కడంతో మంత్రి గారి  బాగోతం బయటపడింది. దీంతో చివరికి మంత్రి తన […]

Update: 2021-06-27 00:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా తో దేశం మొత్తం వణికిపోతోంది. ఒకరిని మరొకరు ముట్టుకోవాలంటేనే భయపడుతున్నారు. అలాంటి సమయంలో ఒక మహిళను ముద్దాడాడు. అందులోను అతను సామాన్యమైన వ్యక్తి కాదు. బాధ్యత కలిగిన పదవి లో ఉన్న మంత్రి. కరోనా ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో సోయమరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు. ఇంకేముంది ఆ ఫోటోలు కాస్తా లీక్ అయ్యి పేపర్ కి ఎక్కడంతో మంత్రి గారి బాగోతం బయటపడింది. దీంతో చివరికి మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు..? ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే.. యూకే లో ఈ ఘటన జరిగింది.. ఆ మంత్రి ఎవరో కాదు యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్‌ హాంకాక్‌. వివరాలలోకి వెళితే..

లండన్ లో గత వారం రోజుల నుంచి యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్‌ హాంకాక్‌ రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన ఆఫీస్ లోనే తన పీఏతో గాఢ చుంబనంలో మునిగితేలుతున్న ఫోటో ఒకదాన్ని ‘పీఏతో హాంకాక్‌ రాసలీలలు’ పేరుతో ది సన్‌ టాబ్లాయిడ్‌ ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా మినిస్టర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారికి హగ్స్ ఇవ్వడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఒక మంత్రి ఇలాంటి పనిచేయడం ఏంటని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ ఫోటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్‌ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే వీటిని ది సన్‌ ఎలా సేకరించింది అనే విషయాన్ని బయటపెట్టలేదు. ఆ మహిళ హాంకాక్‌ కుముందునుచే పరిచయమున్నదని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్‌ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది.

మంత్రి రాజీనామా..

కరోనా సమయంలో మంత్రి మ్యాట్‌ హాంకాక్‌ ప్రజలను ఉత్తేజపరిచేలా స్పీచ్ లు ఇచ్చాడు. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ పెట్టుకోకుండా బయటికి రాకూడదని విస్తృత ప్రచారం చేశాడు. కానీ, ఇప్పుడు అతనే ఇలాంటి వివాదంలో చిక్కుకొనేసరికి ప్రజలు ఆగరహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయమై మంత్రి మ్యాట్‌ హాంకాక్‌ స్పందించారు. ఆ ఫోటోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నాడు. తాను సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోయానని.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించానని ఒప్పుకుని అందుకుగాను ప్రజలకు క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా శనివారం ప్రధాని బోరిస్కు జాన్సన్ కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. తనను క్షమించాల్సిందిగా కోరుతూ తన తప్పుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్‌కాక్‌ రాజీనామాను ఆమోదించిన బోరిస్‌.. ఇప్పటివరకు ఆయన చేసిన పనులను కొనియాడారు.

 

Tags:    

Similar News