‘ప్రశ్నించడమే నేరమైంది.. ప్రశ్నిస్తా’

దిశ, వెబ్‌డెస్క్: ఈఎస్‌ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు ఇటీవల బెయిల్‌ పై విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంపై తాజాగా స్పష్టత ఇచ్చిన ఆయన వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. ‘త‌ప్పులు నిల‌దీయ‌డమే నేను చేసిన త‌ప్ప‌యితే! ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టినా నేను నిల‌దీస్తూనే వుంటాను. స‌ర్కారు అవినీతిని ప్ర‌శ్నించ‌డ‌మే నేరమైతే ఎన్ని అక్ర‌మ‌కేసులు పెట్టినా నేను ప్ర‌శ్నిస్తూనే వుంటాను. నిజాయితీ నా ధైర్యం. స‌త్యం నా ఆయుధం. […]

Update: 2020-09-02 08:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈఎస్‌ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు ఇటీవల బెయిల్‌ పై విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంపై తాజాగా స్పష్టత ఇచ్చిన ఆయన వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. ‘త‌ప్పులు నిల‌దీయ‌డమే నేను చేసిన త‌ప్ప‌యితే! ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టినా నేను నిల‌దీస్తూనే వుంటాను. స‌ర్కారు అవినీతిని ప్ర‌శ్నించ‌డ‌మే నేరమైతే ఎన్ని అక్ర‌మ‌కేసులు పెట్టినా నేను ప్ర‌శ్నిస్తూనే వుంటాను. నిజాయితీ నా ధైర్యం. స‌త్యం నా ఆయుధం. ప్ర‌జాక్షేమ‌మే నా ల‌క్ష్యం. ఈఎస్ఐలో అక్ర‌మాల పేరుతో అక్ర‌మ కేసులో ఇరికించార‌ని ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తించారు. అక్ర‌మ అరెస్టుని ఖండించారు. అనారోగ్యంగా వుంటే కోలుకోవాల‌ని ప్రార్థించారు.’ అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News