వాస్తవాలు రాస్తే కిడ్నాప్‌లా : ఎమ్మెల్యే రఘునందన్
దిశ, దుబ్బాక : హైదరాబాద్ లో తొలి వెలుగు రిపోర్టర్ రఘు అరెస్ట్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. గురువారం దుబ్బాక క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జర్నలిస్టు రఘు అరెస్ట్ హేయమైన చర్య అని ప్రభుత్వాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తొలి వెలుగు జర్నలిస్ట్ సోదరుడు రఘును అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. పేద ప్రజల భూములను అక్రమంగా […]
దిశ, దుబ్బాక : హైదరాబాద్ లో తొలి వెలుగు రిపోర్టర్ రఘు అరెస్ట్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. గురువారం దుబ్బాక క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జర్నలిస్టు రఘు అరెస్ట్ హేయమైన చర్య అని ప్రభుత్వాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తొలి వెలుగు జర్నలిస్ట్ సోదరుడు రఘును అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు.
పేద ప్రజల భూములను అక్రమంగా కాజేస్తున్న టీఆర్ఎస్ నేతల చిట్టాను బయటకు తీస్తున్న జర్నలిస్టు రఘు పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలని రఘునందన్ రావు మాట్లాడారు. వాస్తవాలను ప్రజలకు చూపిస్తున్న జర్నలిస్టులపై దాడులు సమంజసమా అంటూ ప్రశ్నించారు. జర్నలిస్టుల అరెస్టుపై వెంటనే తెలంగాణ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలోని జర్నలిస్టులపై దాడులు ఆపకుంటే ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులకు రక్షణగా నిరసన కార్యక్రమాలను బీజేపీ పిలుపునిస్తు్ందని స్పష్టం చేశారు.