మంత్రి అజయ్ మీలా డబ్బులు తీసుకోడు
దిశ ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై జిల్లా కాంగ్రెస్ నేతలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఖండించారు. అజయ్‌కుమార్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ఆయనపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రోటోకాల్‌ను గౌరవించని అజయ్‌కుమార్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదనే, కాంగ్రెస్ నేతల వరుస విమర్శలను టీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. ఈ సందర్భంగా సోమవారం టీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ… మీలా ఎన్నికలు వస్తే […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై జిల్లా కాంగ్రెస్ నేతలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఖండించారు. అజయ్‌కుమార్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ఆయనపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రోటోకాల్‌ను గౌరవించని అజయ్‌కుమార్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదనే, కాంగ్రెస్ నేతల వరుస విమర్శలను టీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. ఈ సందర్భంగా సోమవారం టీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ…
మీలా ఎన్నికలు వస్తే బీఫారాలు ఇచ్చి డబ్బులు తీసుకునే సంప్రదాయం, పువ్వాడ అజయ్‌కు లేదంటూ రేణుకా చౌదరిని ఉద్దేశించి విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఓ గిరిజన నాయకుడి వద్ద డబ్బులు తీసుకుంది నిజంగా కాదా అంటూ ప్రశ్నించారు. వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేయించుకున్న సంస్కృతి మీదంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, మేయర్ పాపలాల్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు, సుడా కమిటీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.