కరోనా గర్భిణీకి డెలీవరి.. సాయం చేసిన అంగన్‌వాడీ టీచర్లు
దిశ, ఖమ్మం రూరల్ : కృష్ణా జిల్లా తిరువూరు మండలం విస్సనపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి(22) నిండు గర్భిణీ. నాలుగు రోజుల కిందట కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఆమెకు తిరువూరుకు చెందిన వైద్యులు పురుడు పోసేందుకు వెనుకడుగు వేశారు. దిక్కుతోచని స్థితిలో భార్యాభర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డెలివరికీ ఎక్కడికి వెళ్ళాలో అని బాధపడుతున్న సమయంలో ఖమ్మంలోని 59వ డివిజన్ దానవాయిగూడెంలో గల తమ సమీప బంధువులైన అంగన్వాడీ టీచర్లు జి.పద్మ, ఉమా […]
దిశ, ఖమ్మం రూరల్ : కృష్ణా జిల్లా తిరువూరు మండలం విస్సనపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి(22) నిండు గర్భిణీ. నాలుగు రోజుల కిందట కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఆమెకు తిరువూరుకు చెందిన వైద్యులు పురుడు పోసేందుకు వెనుకడుగు వేశారు. దిక్కుతోచని స్థితిలో భార్యాభర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డెలివరికీ ఎక్కడికి వెళ్ళాలో అని బాధపడుతున్న సమయంలో ఖమ్మంలోని 59వ డివిజన్ దానవాయిగూడెంలో గల తమ సమీప బంధువులైన అంగన్వాడీ టీచర్లు జి.పద్మ, ఉమా ఆర్పీ అరుణలకు విషయం చెప్పారు. దీంతో వారు ఖమ్మం రావాలని సూచించారు.
వారి సహాయ సహకారాలతో ఆ భార్యభర్తలు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలి వచ్చారు. పాజిటివ్ ఉన్న గర్భిణీ సుబ్బలక్ష్మికి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యురాలు ప్రశాంతి, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మనోధైర్యం నింపారు. మీకు మేము ఉన్నామంటూ అండగా నిలిచి శనివారం ఆమెకు సాధారణ కాన్పు చేశారు. కరోనా సోకిన మహిళకు ఎలాంటి బెదురు లేకుండా ప్రసవం చేసిన వైద్య సిబ్బందిని అందరూ అభినందనలతో ముంచెత్తారు. తన భార్యకు పురుడుపోసిన నాగేశ్వరరావు, వైద్య సిబ్బందికి భర్త రాంబాబు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.