‘ఖైదీ’కి అరుదైన గౌరవం

దిశ, వెబ్‌డెస్క్: యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో కార్తి.. నా పేరు శివ, ఆవారాతో టాలీవుడ్‌లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఉత్కంఠ రేపే సినిమాలతో వరుస హిట్‌లు కొట్టాడు. ఖాకి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ స్థాయిలో అందరినీ మెప్పించిన సినిమా ఖైది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలైంది. బాక్సాఫిస్ వద్ద భారీ వసూళ్లతో పాటు ఘన విజయాన్ని దక్కించుకుంది. థియేటర్లో […]

Update: 2020-08-01 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో కార్తి.. నా పేరు శివ, ఆవారాతో టాలీవుడ్‌లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఉత్కంఠ రేపే సినిమాలతో వరుస హిట్‌లు కొట్టాడు. ఖాకి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ స్థాయిలో అందరినీ మెప్పించిన సినిమా ఖైది.

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలైంది. బాక్సాఫిస్ వద్ద భారీ వసూళ్లతో పాటు ఘన విజయాన్ని దక్కించుకుంది. థియేటర్లో ప్రేక్షకులు తల పక్కకు తిప్పనంత ఉత్కంఠతో ప్రతీ సీన్‌ను దర్శకుడు తెర మీద చూపెట్టాడు. ఎమోషినల్, యాక్షన్ సీన్‌లు సినిమాకు ప్రాణం పోశాయి.

కాగా, ఈ సినిమాకు అపూర్వ గౌరవం దక్కింది. ఈ నెల 9 నుంచి 15వ తేది వరకు జరిగే టొరంటో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఆగస్టు 12న ఖైది సినిమాను ప్రదర్శిస్తున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా కోసం ఎంతగానో కృషి చేసిన డైరెక్టర్, హీరో, చిత్రయూనిట్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News