కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి ప్రకాష్ రాజ్

కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించగా.. మూవీ సీక్వెల్ మరింత భారీగా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ కాగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో పరిస్థితులు కొంచెం అదుపులోకి వచ్చాక బుధవారం నుంచి మళ్లీ షూటింగ్ మొదలైంది. Start Camera..Action… BACK TO WORK.. pic.twitter.com/LzFFhJrsjG — Prakash Raj (@prakashraaj) […]

Update: 2020-08-26 05:53 GMT

కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించగా.. మూవీ సీక్వెల్ మరింత భారీగా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ కాగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో పరిస్థితులు కొంచెం అదుపులోకి వచ్చాక బుధవారం నుంచి మళ్లీ షూటింగ్ మొదలైంది.

యశ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2లో ఇప్పటికే సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లాంటి భారీ తారాగణం ఉండగా, ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాడు. ‘స్టార్ట్.. యాక్షన్.. కెమెరా..’ అంటూ చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రావడం ఆనందంగా ఉందని ప్రకాష్ రాజ్ తెలపగా.. కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి తనకు వెల్‌కమ్ చెప్తూ ట్వీట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఫైనల్‌గా షూటింగ్ రీస్టార్ట్ చేశామన్న ఆయన.. సినిమా పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News