వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఆయుధాలు స్వాధీనం
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో భాగంగా 66వ రోజు సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో కీలక అనుమానితులుగా భావిస్తున్న దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, సుబ్బారెడ్డి ఇళ్లను సీబీఐ అధికారులు తనిఖీ చేశారు. పులివెందులలోని సునీల్ కుమార్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో భాగంగా 66వ రోజు సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో కీలక అనుమానితులుగా భావిస్తున్న దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, సుబ్బారెడ్డి ఇళ్లను సీబీఐ అధికారులు తనిఖీ చేశారు. పులివెందులలోని సునీల్ కుమార్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్లలో సీబీఐ అధికారులు బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.