"రాష్ట్రమా? కులకార్చిచ్చుతో రగులుతున్న రణరంగమా?"

స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేయడంపై సీఎం సహా వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈసీని సీఎం జగన్ కులపక్షపాతిగా విమర్శించిన నేపథ్యంలో విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధి, ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ‘స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో, మీ కేంద్ర మిత్రుల సహకారంతో ఆదేశాలు జారీ చేయించుకుని, ఇక్కడ స్వరం మార్చి, కేంద్ర ఎన్నికల సంఘం […]

Update: 2020-03-16 02:50 GMT

స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేయడంపై సీఎం సహా వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈసీని సీఎం జగన్ కులపక్షపాతిగా విమర్శించిన నేపథ్యంలో విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధి, ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ‘స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో, మీ కేంద్ర మిత్రుల సహకారంతో ఆదేశాలు జారీ చేయించుకుని, ఇక్కడ స్వరం మార్చి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పనిచేసే ముఖ్య అధికారిని విమర్శించడం…ఇది రాష్ట్రమా? కులకార్చిచ్చుతో రగులుతున్న రణరంగమా?’ అని ట్వీట్ ద్వారా ప్రశ్నిస్తూ దీనికి జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.

Tags:    

Similar News