మీ ఇష్టం..ఎన్నికేసులైనా పెట్టుకోండి: కేశినేని నాని
తనపై కేసులు పెడితే భయపడతానని వైఎస్సార్సీపీ నేతలు ఈ నెల 1 వ తేదీన విజయవాడలోని 47 డివిజన్ లో సామాజిక దూరం పాటించకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్దఎత్తున కూరగాయల పంపిణీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సామాజిక దూరం పాటిస్తూనే తాను నిత్యావసరాలు పంపిణీ చేశానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు గుమిగూడినట్టు ఫోటోలు మార్ఫింగ్ చేసి తనపై కేసు […]
తనపై కేసులు పెడితే భయపడతానని వైఎస్సార్సీపీ నేతలు ఈ నెల 1 వ తేదీన విజయవాడలోని 47 డివిజన్ లో సామాజిక దూరం పాటించకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్దఎత్తున కూరగాయల పంపిణీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సామాజిక దూరం పాటిస్తూనే తాను నిత్యావసరాలు పంపిణీ చేశానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు గుమిగూడినట్టు ఫోటోలు మార్ఫింగ్ చేసి తనపై కేసు పెట్టారని ఆరోపించారు. దొంగ కేసులకు భయపడి పేదలకు, ఆపదలో ఉన్న వారికి సేవ చేయడం మానేస్తానని అనుకుంటున్నారా? అని ఆయన వైఎస్సార్సీపీ నేతలను ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. తనపై ఎన్ని దొంగ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని ఆయన సవాలు విసిరారు. వైఎస్సార్సీపీ నేతలు నిత్యావసరాల పంపిణీ సమయంలో గుమిగూడిన విషయంపై తాము ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు? అని కమిషనర్ మీనాను ప్రశ్నించారు. వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైనే కేసులు నమోదు చేస్తారా? అని అడిగారు.
tags: tdp, ysrcp, tdp mp, vijayawada, kesineni nani