కేరళ టూరిస్టుల కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్
దిశ, ఫీచర్స్ : వర్క్ బిజీ, టెన్షన్స్ నుంచి రిలీఫ్ కోరుకునేవారికి కేరళ మంచి వెకేషన్ స్పాట్. బీచ్‌లు, హిస్టారికల్ ప్లేస్‌లు, ప్రకృతి అందాలతో ప్రశాంతత అందించడంలో ఇండియాలో కేరళకు మించిన ప్లేస్ లేదు. అయితే అక్కడి టూరిస్ట్ ప్రదేశాల వివరాలు తెలియక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటక ప్రాంతాలను వెతికేందుకు సమయం వృథా చేస్తుంటారు. ఈ సమస్యలకు పరిష్కారంగానే కేరళ టూరిజం డిపార్ట్‌మెంట్ తాజాగా మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇది టూరిస్టులకు కొత్త కొత్త […]
దిశ, ఫీచర్స్ : వర్క్ బిజీ, టెన్షన్స్ నుంచి రిలీఫ్ కోరుకునేవారికి కేరళ మంచి వెకేషన్ స్పాట్. బీచ్‌లు, హిస్టారికల్ ప్లేస్‌లు, ప్రకృతి అందాలతో ప్రశాంతత అందించడంలో ఇండియాలో కేరళకు మించిన ప్లేస్ లేదు. అయితే అక్కడి టూరిస్ట్ ప్రదేశాల వివరాలు తెలియక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటక ప్రాంతాలను వెతికేందుకు సమయం వృథా చేస్తుంటారు. ఈ సమస్యలకు పరిష్కారంగానే కేరళ టూరిజం డిపార్ట్‌మెంట్ తాజాగా మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇది టూరిస్టులకు కొత్త కొత్త ప్రదేశాలను గుర్తించడంలో హెల్ప్ చేయడంతో పాటు వారి ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను రికార్డ్ చేసే వీలు కల్పించనుంది.
కోవాలంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఈ యాప్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కేరళ టూరిజం, పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ ముహాద్.. యాప్ ప్రత్యేకతలను వివరించారు. కేరళలోని సరికొత్త టూరిస్టు ప్రదేశాలను అన్వేషించేందుకు ఈ మొబైల్ యాప్ సాయపడుతుందని చెప్పారు. టూరిజం డిపార్ట్‌మెంట్ రాష్ట్రంలోని ప్రతీ గ్రామపంచాయతీలో ఒక పర్యాటక ప్రదేశాన్ని గుర్తించిందని, భూతల స్వర్గంగా పిలువబడుతున్న కేరళ మనోహరమైన ప్రదేశాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఇక ఈ యాప్‌లోని రియల్ టైమ్ ఆడియో గైడ్.. టూరిస్టులకు తామున్న లొకేషన్‌కు చుట్టుపక్కల గల ఐదు స్పాట్‌ల వివరాలను అందిస్తుందని యాక్టర్ మోహన్ లాల్ తెలిపారు. కాగా పర్యాటకులు ఈ మొబైల్ యాప్‌ను ఉపయోగించి.. టాయిలెట్స్, రెస్టారెంట్స్, లోకల్ ఫుడ్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు.