కామెంట్స్ వివాదాస్పదమైతే జైలుకే : సీఎం పినరయి
దిశ, వెబ్‌డెస్క్ : కేరళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందించింది. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా దాడులు పెరిగిపోతూ ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పినరయి ప్రభుత్వం ప్రకటించింది.ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆమోదముద్ర వేశారు. కేరళ పోలీసు యాక్ట్ కింద కొత్త సెక్షన్(ఏ)కు ఆమోదం […]
దిశ, వెబ్‌డెస్క్ : కేరళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందించింది. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా దాడులు పెరిగిపోతూ ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పినరయి ప్రభుత్వం ప్రకటించింది.ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆమోదముద్ర వేశారు. కేరళ పోలీసు యాక్ట్ కింద కొత్త సెక్షన్(ఏ)కు ఆమోదం తెలిపినట్లు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ చట్టం ప్రకారం ఓ వ్యక్తి మరొకరిని బెదిరించేందుకు, ఇబ్బంది పాలు చేయాలనే లక్ష్యంతో పోస్టు పెడితే అతనికి ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ.10వేల జరిమానా విధించవచ్చు. ఒక్కొసారి రెండూ అమలు కావొచ్చును. అయితే, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదమున్నదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
పత్రికా స్వేచ్ఛపై ఈ చట్టంతో దాడులు జరగవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇండివిడువల్స్‌పై దాడులు పెరిగిన నేపథ్యంలోనే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు సీఎం పినరయి విజయన్ ఇటీవలే తెలిపారు.