కరెంట్ బిల్లులు రెండు నెలల పాటు వసూలు చేయవద్దు.. కేరళ సీఎం ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్: కేరళ సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రమంలో మరో రెండు నెలల పాటు కరెంట్ బిల్లులను వసూలు చేయడం లేదని తెలిపారు. కరెంట్ బిల్లులు కట్టాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేయవద్దని సూచించారు. అలాగే బ్యాంకులకు కూడా పినరయి విజయన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను అనుభవిస్తున్నారని, వారి నుంచి లోన్ల రికవరీని బంద్ చేయాలని తెలిపారు. రాష్ట్ర […]

Update: 2021-05-05 10:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేరళ సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రమంలో మరో రెండు నెలల పాటు కరెంట్ బిల్లులను వసూలు చేయడం లేదని తెలిపారు. కరెంట్ బిల్లులు కట్టాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేయవద్దని సూచించారు.

అలాగే బ్యాంకులకు కూడా పినరయి విజయన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను అనుభవిస్తున్నారని, వారి నుంచి లోన్ల రికవరీని బంద్ చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పోలీసులు అన్ని విధాలా సహకరిస్తారని, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తారని స్పష్టం చేశారు.

Tags:    

Similar News