నోరూరించే మటన్ కీమా మెంతికూర..!
మీ భర్త, పిల్లల కోసం ఏదైనా రుచికరమైన వంట చేయాలనుకుంటున్నారా.. నాన్‌వెజ్ ప్రియులైనా ఒకే రకంగా మటన్ కీమా తినడానికి ఇష్టపడడం లేదా.. అయితే నోరూరించే కీమా మెంతికూర రెసిపీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. కావాల్సిన పదార్ధాలు: మటన్ కీమా -పావు కేజీ మెంతీకూర -2 కప్పులు పచ్చిమిర్చి -3 ఉల్లిపాయలు -2 టమాటాలు -2 వాటర్ -ఒక గ్లాసు నూనె -3 టేబుల్ స్పూన్స్ పసుపు -1/2 టీస్పూన్ కారం -2 టీస్పూన్స్ […]
మీ భర్త, పిల్లల కోసం ఏదైనా రుచికరమైన వంట చేయాలనుకుంటున్నారా.. నాన్‌వెజ్ ప్రియులైనా ఒకే రకంగా మటన్ కీమా తినడానికి ఇష్టపడడం లేదా.. అయితే నోరూరించే కీమా మెంతికూర రెసిపీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
మటన్ కీమా -పావు కేజీ
మెంతీకూర -2 కప్పులు
పచ్చిమిర్చి -3
ఉల్లిపాయలు -2
టమాటాలు -2
వాటర్ -ఒక గ్లాసు
నూనె -3 టేబుల్ స్పూన్స్
పసుపు -1/2 టీస్పూన్
కారం -2 టీస్పూన్స్
అల్లంవెల్లుల్లి పేస్ట్ -2 టీస్పూన్స్
జీలకర్ర -1/2 టీస్పూన్
ధనియాల పొడి -1 టీస్పూన్
గరం మసాలా -1/2 టీస్పూన్
ఉప్పు -తగినంత
కొత్తిమీర -ఒక కప్పు.
తయారు చేయు విధానం:
శుభ్రంగా కడిగిన పావు కేజీ మటన్ కీమాలో ఒక 1/4 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ అల్లం వెల్లులి పేస్ట్, 1 టీస్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా ఉడనివ్వాలి లేదా కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరో పక్క స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో 2 కప్పుల మెంతికూరను వేగించుకుని దాని పక్కన పెట్టుకోవాలి.
అదే ఆయిల్లో 1/2 టీస్పూన్ జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని వేగించుకోవాలి. దానిలో 1 టీస్పూన్ అల్లం వేసుకుని రెండు తరిగిన టమాటా ముక్కలు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. వాటిలో 1/4 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకుని మొదటగా ఉడకబెట్టిన కీమాను వాటర్‌తో సహా వేసుకోవాలి. అనంతరం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో 1/2 టీస్పూన్ గరం మాసాలా వేసుకుని ప్యాన్‌పై మూత పెట్టి తక్కువ మంటపై వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్‌లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే వేడి వేడి కీమా మెంతికూర రెడీ..