మృతుల కుటుంబాలకు కేసీఆర్, టీఆర్ఎస్ అండ : కేటీఆర్

దిశ తెలంగాణ బ్యూరో : ఇంట్లో వాళ్లు దూరమయ్యారని అధైర్య పడొద్దని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్లో 80 మందికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను అందజేసి మాట్లాడారు. 60 లక్షల మంది కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ కుటుంబమేనని స్పష్టం చేశారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన పార్టీ కార్యకర్త కుటుంబం అధైర్య పడొద్దని, ప్రతి కార్యకర్త ఇంటికి […]

Update: 2021-08-04 05:44 GMT

దిశ తెలంగాణ బ్యూరో : ఇంట్లో వాళ్లు దూరమయ్యారని అధైర్య పడొద్దని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్లో 80 మందికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను అందజేసి మాట్లాడారు. 60 లక్షల మంది కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ కుటుంబమేనని స్పష్టం చేశారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన పార్టీ కార్యకర్త కుటుంబం అధైర్య పడొద్దని, ప్రతి కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్ద దిక్కు గా ఉంటారన్నారు. 80 మంది కుటుంబ సభ్యులు సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గత సంవత్సరం 955 మంది మృతి చెందారని, వారందరి కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడించారు. పార్టీని కాపాడుతున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు. అనంతరం 18 కోట్ల 39 లక్షల 36 వేల రూపాయల చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, నారదాసు లక్ష్మణరావు, బస్వరాజు సారయ్య, బిజీ గౌడ్, సోమ భరత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News