ఖజానాను కేసీఆర్ కాజేశారు: తీన్మార్ మల్లన్న

దిశ,పాలకుర్తి : రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ కాజేశారనీ, మంత్రులు భూములను దోస్తున్నారని వరంగల్,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఎన్నికల పాదయాత్ర మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ చేరుకుంది. ప్రధాన కూడలిలో ప్రచార సభలో మల్లన్న మాట్లాడుతూ… పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని..16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కేసీఆర్ చేతిలో పెట్టామని అన్నారు. ఏడేండ్ల పాలనలో అప్పుల కుప్పగా రాష్రాన్ని మార్చి ప్రతి ఒక్కరిపై […]

Update: 2020-12-14 09:21 GMT

దిశ,పాలకుర్తి : రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ కాజేశారనీ, మంత్రులు భూములను దోస్తున్నారని వరంగల్,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఎన్నికల పాదయాత్ర మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ చేరుకుంది. ప్రధాన కూడలిలో ప్రచార సభలో మల్లన్న మాట్లాడుతూ… పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని..16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కేసీఆర్ చేతిలో పెట్టామని అన్నారు. ఏడేండ్ల పాలనలో అప్పుల కుప్పగా రాష్రాన్ని మార్చి ప్రతి ఒక్కరిపై ఎనభై వేల అప్పును పెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఆరోపించారు. మాయమాటలతో మరోమారు మోసం చేసేందుకు ఉద్యోగ ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News