దళిత బంధుతో మరోసారి దగా : కత్తి వెంకటస్వామి
దిశ, పాలేరు: దళిత బంధు పేరుతో దళితులను మరోసారి దగా చేయడానికి సీఎం కేసీఆర్ వస్తున్నారని, జాగ్రత్తగా వహించాలని దళిత, గిరిజన హక్కుల ఆత్మ గౌరవ దండోరా కో ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అన్నారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మాధవి రెడ్డి నివాసంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన […]
దిశ, పాలేరు: దళిత బంధు పేరుతో దళితులను మరోసారి దగా చేయడానికి సీఎం కేసీఆర్ వస్తున్నారని, జాగ్రత్తగా వహించాలని దళిత, గిరిజన హక్కుల ఆత్మ గౌరవ దండోరా కో ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అన్నారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మాధవి రెడ్డి నివాసంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయకపోగా, ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక కొత్త పథకంతో జనాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, ఇప్పుడు హుజూరాబాద్ దళిత బంధు పథకానికి పెద్ద తేడా లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ దళిత సమాజం మొత్తం దళిత బంధు కోసం మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామాసహాయం మాధవి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, నియోజకవర్గ యూత్ నాయకులు కీసర సంకీర్త్ రెడ్డి, మండల అధ్యక్షుడు మట్టే గురవయ్య, సీనియర్ నాయకులు మంకెన వాసు, దాసరి వెంకన్న, తుపాకుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.