‘ఆ పథకంతో కేసీఆర్ దగా చేస్తున్నారు’
దిశ, సంగారెడ్డి: దళితులకు అన్యాయం జరుగుతున్నా మన సామాజిక వర్గానికి చెందిన 29 మంది ఎమ్మెల్యేలు నోరెత్తడం లేదని మాజీ ఐపీఎస్, రిటైర్డ్ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం స్వేరోస్ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నా దళిత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ […]
దిశ, సంగారెడ్డి: దళితులకు అన్యాయం జరుగుతున్నా మన సామాజిక వర్గానికి చెందిన 29 మంది ఎమ్మెల్యేలు నోరెత్తడం లేదని మాజీ ఐపీఎస్, రిటైర్డ్ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం స్వేరోస్ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నా దళిత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో 1000 కోట్లు ఇస్తానని దళిత బంధు పథకం పేరుతో ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బహుజన వర్గాలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. బుద్దుడు, సావిత్రిబాయి పూలే, మహాత్మ జ్యోతిబా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాన్షీరాం ఆశయాల సాధనకోసమే తాను ముందుకు వచ్చానన్నారు.