ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుందాం.. ఎస్పీ అఖిల్ మహాజన్
ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 31న జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనీఖీలు నిర్వహించబడుతాయని, నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డిజేలు, అధిక శబ్దం వచ్చే బాక్స్ లు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరమని, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇండ్లు, ప్రవేట్ ఆస్తులు, వీధి దీపాలను ధ్వంసం చేసిన, మహిళలను పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తప్పవన్నారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడతామని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వారి సంరక్షకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసు శాఖ అంక్షలను ఎవరైనా అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా డయల్ 100 నంబర్‌కు సమాచారం అందిస్తే, తక్షణమే స్పందించి వారి పై కఠిన చర్యలు తీసుకోబడుతాయన్నారు. ఈ కొత్త సంవత్సర వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, జిల్లా ప్రజలకు ఆయన పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.