కరీంనగర్ రూరల్ డివిజన్ ఏసీపీ బాధ్యతలు స్వీకరణ
కరీంనగర్ కమిషనరేట్ లోని రూరల్ డివిజన్ ఏసీపీ గా శుభం ప్రకాష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
దిశ, కొత్తపల్లి : కరీంనగర్ కమిషనరేట్ లోని రూరల్ డివిజన్ ఏసీపీ గా శుభం ప్రకాష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్ర, వార్ధ జిల్లాకి చెందిన శుభం ప్రకాష్ ఐఐటీ ఖరగ్ పూర్ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ పట్టా పొందారు. 2022 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ నందు అస్సాల్ట్ కమాండర్ గా విధులు నిర్వహించిన ఆయన గడిచిన సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ లకు కేటాయించిన పోస్టింగుల్లో కరీంనగర్ రూరల్ ఏసీపీ గా నియమించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలోని ఎస్హెచ్ఓ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సమావేశమయ్యారు. పరిధిలో జరిగే నేరాలపై చర్చించారు.