పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలతో రైతులు విరాజిల్లాలని రాజన్నను వేడుకున్నట్టు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
దిశ, వేములవాడ : శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలతో రైతులు విరాజిల్లాలని రాజన్నను వేడుకున్నట్టు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని విప్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా, ఈఓ వినోద్ రెడ్డి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కోడెను కడితే కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆశీస్సులతో ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే రూ.127 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.