పోటీతత్వం తోనే విజయాలు సొంతం : మానకొండూరు ఎమ్మెల్యే

పోటీతత్వం తో ఆడినప్పుడే క్రీడల్లో విజయాలను సొంతం చేసుకోవచ్చు అని

Update: 2025-01-01 13:42 GMT

దిశ,బెజ్జంకి : పోటీతత్వంతోనే ఆడినప్పుడే క్రీడల్లో విజయాలను సొంతం చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలో క్రికెట్ అసోసియేషన్ ( బీసీఏ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 47 వ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచి మ్యాచ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత విద్యతోపాటు క్రీడా రంగంలో రాణించాలన్నారు. నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా క్రీడల్లో సత్తా చాటవచ్చనని గ్రామీణ ప్రాంత యువకులు క్రికెట్ లో చక్కటి ప్రదర్శన ద్వారా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని తద్వారా మానకొండూరు నియోజకవర్గానికి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని, క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, ఓటమి గెలుపునకు నాంది కావాలన్నారు.

47 సంవత్సరాలుగా నిర్నిరోధంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమని ఆ నిర్వాహకులను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ముక్కస రత్నాకర్ రెడ్డి, జెల్ల ప్రభాకర్, అక్కర వేణి పోచయ్య, లింగాల శ్రీనివాస్, పులి రమేష్, మహంకాళి బాబు, కర్రవుల శంకర్ ,బైరి సంతోష్, కాంగ్రెస్ అనుబంధ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News