ఇందిరా పార్క్ సభను విజయవంతం చేయండి.. ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవితను రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ‌నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తేజ్ దీప్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2024-12-29 15:55 GMT

దిశ, కరీంనగర్ రూరల్ : ఎమ్మెల్సీ కవితను రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ‌నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తేజ్ దీప్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం నిజామాబాద్ పర్యటన విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఈ నెల మూడో తారీకు నాడు సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ కులాలలో, బీసీ కుల సంఘాల నాయకులతో సభను ఏర్పాటు చేశారని, ఆ సభను బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చెయ్యాలని కవిత పిలుపును ఇచ్చారు.


Similar News