జగిత్యాలలో బాలిక కిడ్నాప్ కు యత్నం...

జగిత్యాల బస్ స్టాప్ లో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.

Update: 2024-12-29 16:52 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల బస్ స్టాప్ లో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఊరికి వెళ్లేందుకు బస్ స్టాప్ లో బస్సు దిగి ఆటో కోసం తల్లి కూతుర్లు ఎదురుచూస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను ఎత్తుకొని పారిపోతున్న క్రమంలో తల్లి కేకలు వేయగా గమనించిన స్థానికులు యువకుడిని అడ్డగించి బాలికను కాపాడారు. బాలిక కిడ్నాప్ యత్నించిన యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కిడ్నాప్ కు ప్రయత్నించిన వ్యక్తి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన నవీన్ గా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలియ వచ్చింది.


Similar News