ఎమ్మెల్సీ కవితను పట్టించుకోని కేసీఆర్ సర్కార్..!

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత అంతే పవర్‌ఫుల్ అయిన ప్రజాప్రతినిధులు ఎవరూ అన్న ప్రశ్న వస్తే.. మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత అని చెబుతారు. అలాంటిది ఎమ్మెల్సీ కవిత విన్నవిస్తే సీఎం కేసీఆర్ స్పందించి పరిష్కరిస్తారు. గతంలోనూ ఎంపీగా చేసిన కవిత రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఓ వెలుగు వెలిగారు. కానీ, ఎంత వెలిగినా.. ఎప్పుడో ఓ సారి కొండెక్కాల్సిందే అన్న చందంగా.. నిజామాబాద్ ప్రజలు మరోసారి అవకాశం […]

Update: 2021-10-11 08:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత అంతే పవర్‌ఫుల్ అయిన ప్రజాప్రతినిధులు ఎవరూ అన్న ప్రశ్న వస్తే.. మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత అని చెబుతారు. అలాంటిది ఎమ్మెల్సీ కవిత విన్నవిస్తే సీఎం కేసీఆర్ స్పందించి పరిష్కరిస్తారు. గతంలోనూ ఎంపీగా చేసిన కవిత రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఓ వెలుగు వెలిగారు. కానీ, ఎంత వెలిగినా.. ఎప్పుడో ఓ సారి కొండెక్కాల్సిందే అన్న చందంగా.. నిజామాబాద్ ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వకపోవడంతో.. కొన్ని రోజులు ప్రజా సంగ్రామంలో కనిపించలేదు. అయితే, సీఎం కేసీఆర్ వెంటనే స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ పదవిని అప్పజెప్పారు.

ఈ క్రమంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఎమ్మెల్సీ కవిత.. తనను ఎమ్మెల్సీగా గెలిపించిన ఎంపీటీసీలకు సరైన గుర్తింపు ఉండటం లేదని, వేతనం కూడా తక్కువేనని, కనీసం పంచాయతీలో కుర్చీ కూడా ఉండటం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే ఎంపీటీసీలను గుర్తించి, పంచాయతీలో ఓ కుర్చీ వేయించాలని కోరింది. అయితే, సీఎం కేసీఆర్ కుమార్తె కావడం, అసెంబ్లీలోనే తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో ఎంపీటీసీలంతా సంతోషించి కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

అనుకున్నట్లుగానే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పెండింగ్‎లో ఉన్న గౌరవ వేతన పెంపు అమలుపై నిర్ణయం తీసుకున్నారు. ఇక తమకు మంచి రోజులొచ్చాయని, అందరు ప్రజాప్రతినిధులుగానే తమకు పంచాయతీల్లో చాంబర్ ఏర్పాటవుతుందనుకున్నారు. కానీ, ఇటు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి, ఎంపీటీసీల సమస్యపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మళ్లీ నిరాశే మిగిలింది.

ఇక ప్రభుత్వం అమలు చేసే వరకూ వేచి చూసే బదులు పంచాయతీలే స్వయంగా ఎంపీటీసీకి చాంబర్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం బుద్దిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పంచాయతీ కార్యాలయంలోనే ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని సర్పంచ్‌ అన్నం మధుసూదన్‌ రెడ్డి తన సొంత ఖర్చులతో చాంబర్‌ ఏర్పాటు చేసి టేబుల్‌, కుర్చీని ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వంపై ఆధారపడి ఉండలేమని సొంతగా ఏర్పాటు చేసుకునేందుకే సిద్ధమవుతున్నట్టు సంకేతం ఇచ్చారు.

Tags:    

Similar News