హుజురాబాద్ బైపోల్.. సీఎం కేసీఆర్ ఆడియో కాల్ వైరల్

దిశ, జమ్మికుంట: హుజురాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి నేతలు, ప్రజలతో మాట్లాడుతున్నారు. తాజాగా హుజురాబాద్‌కి చెందిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి  కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ  ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకోస్తున్న దళిత బంధు పథకం గురించి ఆయనతో కేసీఆర్ మాట్లాడారు. హుజురాబాద్‌తో దళిత బంధు గురించి […]

Update: 2021-07-24 02:43 GMT

దిశ, జమ్మికుంట: హుజురాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి నేతలు, ప్రజలతో మాట్లాడుతున్నారు. తాజాగా హుజురాబాద్‌కి చెందిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకోస్తున్న దళిత బంధు పథకం గురించి ఆయనతో కేసీఆర్ మాట్లాడారు. హుజురాబాద్‌తో దళిత బంధు గురించి అన్ని గ్రామాలకు తెలియాలని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పథకమని ఫోన్‌లో కేసీఆర్ చెప్పారు.

Full View

ఇలాంటి పథకం ఎక్కడా లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. హుజురాబాద్‌లో ప్రతి గ్రామానికి ఈ పథకం గురించి తెలియాలన్నారు. ఈ నెల 26న హుజురాబాద్‌కు చెందిన దళితులందరూ కలిసి ప్రగతిభవన్‌కు రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. అధికారులు దీనికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. దళిత జాతి గొప్పదని, వారి అభివృద్ధికి కృషి చేస్తానని కేసీఆర్ తెలిపారు.

Read More:

యూట్యూబ్‌లో కొత్తగా ‘న్యూ టు యూ’ ఫీచర్

 

 

Tags:    

Similar News