విదేశాల్లో.. కత్రినా 'సూపర్ హీరో'

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ ‘సూపర్ హీరో’ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ మేకర్ అలీ అబ్బాస్ జాఫర్.. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీని గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారు. ఈ సినిమాను నాలుగు దేశాల్లో షూట్ చేయనున్నట్లు తెలిపిన ఆయన.. ఇప్పటికే దుబాయ్, అబుదాబిలో ప్లేస్‌లు చూశానని చెప్పాడు. ఆ తర్వాత పోలాండ్, జార్జియాలో చూస్తామని తెలిపాడు. ఇండియన్ నేటివిటీకి తగినట్లుగా సినిమా చేస్తామని.. హిమాచల్ […]

Update: 2020-10-21 00:22 GMT

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ ‘సూపర్ హీరో’ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ మేకర్ అలీ అబ్బాస్ జాఫర్.. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీని గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారు. ఈ సినిమాను నాలుగు దేశాల్లో షూట్ చేయనున్నట్లు తెలిపిన ఆయన.. ఇప్పటికే దుబాయ్, అబుదాబిలో ప్లేస్‌లు చూశానని చెప్పాడు. ఆ తర్వాత పోలాండ్, జార్జియాలో చూస్తామని తెలిపాడు. ఇండియన్ నేటివిటీకి తగినట్లుగా సినిమా చేస్తామని.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలో కూడా సినిమా చిత్రీకరణ ఉంటుందన్నారు. పర్వత ప్రాంతాల్లో కొంత భాగం షూటింగ్ ఉంటుందని చెప్పారు. అయితే ప్రదేశాలను చూసేందుకు వెళ్లిన ప్రతీ చోట కరోనా పరీక్ష తప్పకుండా ఉంటుందని.. దీని వల్ల టైమ్ ఎక్కువ తీసుకోవడంతో పాటు బడ్జెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

కాగా కత్రినా ఇందుకోసం కఠినమైన ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంది. ఈ సినిమాకు సెట్ అప్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి, కత్రినా ‘ఫోన్ బూత్, టైగర్ 3’ సినిమాలు పూర్తి చేశాక.. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు అలీ అబ్బాస్ జాఫర్. క్యాట్ డేట్స్ కేటాయించిన వెంటనే ఇందుకు సంబంధించిన ఫిజికల్ ట్రైనింగ్ మొదలు పెడతామని చెప్పారు.

Tags:    

Similar News