ఘనంగా కార్తీకపౌర్ణమి వేడుకలు.. భక్తులతో ఆలయాలు కిటకిట
దిశ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుండి మహిళలు ఇంటి ముందు తులసి గద్దెల వద్ద దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని ఆలయాలలోదీపాలు వెలిగించి ఆలయంలో హారతులు అర్పించారు. జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర,ముక్తేశ్వర ఆలయములో కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో భక్తులు పవిత్ర స్నానం చేసి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు పసుపుతో గౌరమ్మను […]
దిశ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుండి మహిళలు ఇంటి ముందు తులసి గద్దెల వద్ద దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని ఆలయాలలోదీపాలు వెలిగించి ఆలయంలో హారతులు అర్పించారు. జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర,ముక్తేశ్వర ఆలయములో కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో భక్తులు పవిత్ర స్నానం చేసి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు పసుపుతో గౌరమ్మను తయారుచేసి గోదారిలో వదిలారు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదిలారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోకి చేరుకుని చెట్ల కింద పోసి దీపాలను వెలిగించి లక్ష దీపాలను కాల్చారు. పురోహితులకు ఉసిరి దీపాలను బియ్యాన్ని కానుకగా మహిళలు ఇచ్చారు. తమకు ఇష్టమైన కార్తీక పౌర్ణమి రోజున మహిళలు ఎంతో ఇష్టంగా తమకిష్టమైన దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజించారు.
కాలేశ్వరం ఆలయమునకు మహారాష్ట్ర చత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఘన్పూర్ మండలంలోని కోట గుళ్ళు దేవాలయం కాలేశ్వరము అనంతరం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ఆలయానికి హాజరైనారు. ఘన్పూర్ భూపాలపల్లి రేగొండ, టేకుమట్ల మొగుళ్లపల్లి నుండి సైతం ఎంతో మంది మహిళలు చేరుకున్నారు. అలాగే భూపాల్ పల్లి డీఎస్పీ, సంపత్ రావు సీఐ పులి వెంకట్ ప్రత్యేకంగా ఆలయానికి చేరుకొని సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. కాటారం మండలంలోని అయ్యప్ప దేవాలయం హనుమాన్ దేవాలయంలో, భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ రామ దేవాలయంలో, మల్హర్ మండలాల్లోని సాయిబాబా దేవాలయంలో, చిట్యాల మండలంలో నైన్ పాక ఆలయంలో, రేగొండ మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో, మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిరోజు మహిళలు పూజలు నిర్వహిస్తూ తమ ఇష్టదైవాన్ని కోరికలు తీరాలని వేడుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఆలయంలో మహిళతో సందడిగా ఉన్నాయి. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం వద్ద, ఘన్పూర్ మండలంలోని కోట గుళ్ళు వద్ద పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీలు భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.