వారం రోజులు రోడ్డు ఊడ్చాలి.. పోలీస్ అధికారికి హైకోర్టు ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్: వారంరోజుల పాటు రోడ్డును ఊడ్చాలని ఓ పోలీస్ అధికారిని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 20న సురేశ్ అనే యువకుడు అదృశ్యం కాగా తల్లి తారాబాయి కలబురిగి బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ స్టేషన్ హౌజ్ ఆఫీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో విసిగిపోయిన తారాబాయి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు స్టేషన్‌ హౌజ్ […]

Update: 2020-12-24 05:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: వారంరోజుల పాటు రోడ్డును ఊడ్చాలని ఓ పోలీస్ అధికారిని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 20న సురేశ్ అనే యువకుడు అదృశ్యం కాగా తల్లి తారాబాయి కలబురిగి బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ స్టేషన్ హౌజ్ ఆఫీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో విసిగిపోయిన తారాబాయి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు స్టేషన్‌ హౌజ్ ఆఫీసర్‌కు డిసెంబర్ 17న శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వారంరోజుల పాటు పోలీస్ స్టేషన్ ముందు ఉన్న రోడ్డును ఊడ్చాలని ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సురేశ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News