మంత్రి రాసలీలలు : ఆ యువతి ప్లాన్ చేస్తే.. దినేష్ రంగంలోకి దిగాడా?
దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక బీజేపీలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. క్యాబినెట్ లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న రమేష్ జార్కిహొళి తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగం పేరుతో ఓ మహిళను లోబరుచుకున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి గారి రాసలీలల్ని దినేష్ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త వీడియోలు విడుదల చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం కర్ణాటక బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఆ యువతి ప్లాన్ చేస్తే.. దినేష్ రంగంలోకి దిగాడా? మంత్రి రమేష్ […]
దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక బీజేపీలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. క్యాబినెట్ లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న రమేష్ జార్కిహొళి తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగం పేరుతో ఓ మహిళను లోబరుచుకున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి గారి రాసలీలల్ని దినేష్ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త వీడియోలు విడుదల చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం కర్ణాటక బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది.
ఆ యువతి ప్లాన్ చేస్తే.. దినేష్ రంగంలోకి దిగాడా?
మంత్రి రమేష్ జార్కిహొళి .., బెంగళూరు ఆర్టీ నగర్ కు చెందిన ఓ యువతికి కేపీసీఎల్ లో ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పాడు. ఆ మాయమాటలు విన్న బాధితురాలు మంత్రి మాటల్ని గుడ్డిగా నమ్మింది. ఇదే అదునుగా భావించిన ఆయన యువతిని మోసం చేశాడు. లోబరుచుకున్నాడు. అసలే మంత్రి, అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటారా? ఒకవేళ ఫిర్యాదు చేస్తే కుటుంబ సభ్యులకు ప్రాణనష్టం జరుగుతుందో ఆందోళనకు గురైన బాధితురాలు మంత్రి మోసాన్ని బెంగళూర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ దినేశ్ కల్లహళ్లిని సంప్రదించింది. వారం రోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి దినేష్ కల్లహళ్లితో భేటీ అయినట్లు తెలిపారు. భేటీ జరిగిన వారం రోజుల తర్వాత బీజేపీ మంత్రి రామేష్ జార్కిహోళి బాధితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్ని దినేష్ విడుదల చేశారు. కానీ ఆ వీడియోలు దినేష్ విడుదల చేస్తే.., ఆ వీడియోల్ని ఎవరు తీశారనేది చర్చాంశనీయంగా మారింది.
కర్ణాటక ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు
వెస్ట్ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు 8 దశల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29వరకూ ఎన్నికలు జరగాల్సి ఉంది. అదే సమయంలో వెస్ట్ బెంగాల్ తో పాటూ కర్ణాటకలోని బెలగావి లోక్ సభ నియోజకవర్గం, బసవకళ్యాణ్, మాస్కీ, సిందగి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీల అభ్యర్ధులు, ముఖ్యనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కార్ణాటక కాంగ్రెస్ – జేపీఎస్ ను కూల్చేసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీరోల్ ప్లే చేసిన రమేష్ జార్కిహొళి రాసలీలలు వీడియోలు వెలుగులోకి రావడం కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
నేను నిర్దోషిని
రెండు రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గకుండా ఉండేందుకు .., బీజేపీ పార్టీ అధిష్టానం పదవికి రాజీనామా చేయాలంటూ రమేష్ జార్కిహొళి పై ఒత్తిడి తెచ్చింది. రాసలీలల వీడియో వెలుగు వచ్చిన అనంతరం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.., తాను పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ కొద్ది సేపటి క్రితమే రమేష్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై వస్తున్న ఆరోపణలు సత్యానికి దూరంగా ఉన్నాయి. స్పష్టమైన దర్యాప్తు అవసరం. నేను నిర్ధోషిగా బయకు వస్తాననే నమ్మకం నాకుంది. నాపై వస్తున్న ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప అంగీకరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.