రివర్స్ గేరులో రాష్ట్రం: కన్నా

          మొన్న ఆర్టీసీ ఛార్జీలు, నిన్న పెట్రో ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం ఇవాళ కరెంట్ ఛార్జీలు పెంచి ఏపీ రాష్ట్రాన్ని రివర్స్ గేరులో తీసుకెళ్తోందని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఈ నిర్ణయంతో మధ్య తరగతి కుటుంబాలపై పెనుభారం పడుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలో తెలియక వైసీపీ ప్రభుత్వం ‘తుగ్లక్’ పనులతో ప్రజల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. ఏపీ […]

Update: 2020-02-10 09:02 GMT

మొన్న ఆర్టీసీ ఛార్జీలు, నిన్న పెట్రో ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం ఇవాళ కరెంట్ ఛార్జీలు పెంచి ఏపీ రాష్ట్రాన్ని రివర్స్ గేరులో తీసుకెళ్తోందని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఈ నిర్ణయంతో మధ్య తరగతి కుటుంబాలపై పెనుభారం పడుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలో తెలియక వైసీపీ ప్రభుత్వం ‘తుగ్లక్’ పనులతో ప్రజల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. ఏపీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.

Tags:    

Similar News