కంగనా సిస్టర్ వాలెంటైన్స్ డే స్పెషల్ క్లాస్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ బాలీవుడ్ జనాలపై మరో ట్వీట్ బాంబ్ విసిరింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాజకీయ చర్చ ఎక్కువైపోతోందని, ప్రేమికుల రోజు సందర్భంగా బాలీవుడ్ జంటల గాసిప్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పింది. దీంతో నెటిజన్లు కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందనుకున్నారు. కానీ, మళ్లీ అవే విమర్శలు చేసిన రంగోలి తనకు తానే సాటి అనిపించుకుంది. బాలీవుడ్ […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ బాలీవుడ్ జనాలపై మరో ట్వీట్ బాంబ్ విసిరింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాజకీయ చర్చ ఎక్కువైపోతోందని, ప్రేమికుల రోజు సందర్భంగా బాలీవుడ్ జంటల గాసిప్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పింది. దీంతో నెటిజన్లు కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందనుకున్నారు. కానీ, మళ్లీ అవే విమర్శలు చేసిన రంగోలి తనకు తానే సాటి అనిపించుకుంది.
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోన్.. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటల ఫొటోలను షేర్ చేసింది రంగోలి. ‘మీరు గమనించారా ఈ లవ్‌బర్డ్స్ యూరప్, అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేసేందుకు వెళ్తుంటారు. అప్పుడు సెల్ఫీలు తీసుకుని వారి గురించి, ఆ దేశాల గొప్పతనం గురించి తెగ ప్రచారం చేస్తారు. అదే శ్రీలంక, బ్యాంకాక్ వంటి అభివృద్ధి చెందని దేశాలకు వెళ్తే మాత్రం సెల్ఫీలు ఉండవు. ప్రచారం ఉండదు. ఎందుకంటే అవి వెనుకబడిన దేశాలు కదా? బాలీవుడ్ జంటల్లారా కాస్త అభివృద్ధి చెందని దేశాలకూ ప్రచారం కల్పించండి అంటూ క్లాస్ ఇచ్చింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఫొటోలు షేర్ చేయడం, చేయకపోవడం అనేది వాళ్ల ఇష్టం మీకెందుకు అని కొందరు ప్రశ్నిస్తుంటే.. కంగనా సిస్టర్ చెప్పిందే కరెక్ట్ అంటున్నారు మరికొందరు.