ప్రియాంక చోప్రా సూపర్ కూల్ : కంగన

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ‘ఫ్యాషన్’ సినిమా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసింది. ఈ సినిమా ద్వారానే కంగన సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకుంది. కాగా ‘క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్ మను’ లాంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఫ్యాషన్ సినిమాలో తను చేసిన మోడల్ షోనాల్ గుజ్రల్ క్యారెక్టర్ గురించి జనాలు మాట్లాడుతుండటం కాస్త గర్వంగా ఉందని […]

Update: 2020-10-29 02:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ‘ఫ్యాషన్’ సినిమా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసింది. ఈ సినిమా ద్వారానే కంగన సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకుంది. కాగా ‘క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్ మను’ లాంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఫ్యాషన్ సినిమాలో తను చేసిన మోడల్ షోనాల్ గుజ్రల్ క్యారెక్టర్ గురించి జనాలు మాట్లాడుతుండటం కాస్త గర్వంగా ఉందని చెప్పింది కంగన. ఇక డైరెక్టర్ మధుర్ భండార్కర్ ఈ సినిమా ద్వారా మోడల్స్ తమ కెరియర్‌లో ఎదుర్కొనే కష్టాల గురించి వివరించే ప్రయత్నం చేశాడు.

ప్రియాంక చోప్రా ఫిమేల్ లీడ్ క్యారెక్టర్‌లో కనిపించినా సరే.. కంగన తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. కాగా ఈ చిత్రం చేసేటప్పుడు తను ఓ టీనేజర్ అని, కానీ ప్రియాంక మాత్రం అప్పటికే స్టార్ హీరోయిన్ అని తెలిపింది కంగన. అయినా సరే తనెప్పుడూ నన్ను జూనియర్‌గా చూడలేదని.. ఫ్రెండ్‌గానే ట్రీట్ చేసిందని చెప్పుకొచ్చింది. ఫుడ్ షేర్ చేసుకునేదని.. డ్రెస్సింగ్, యాక్టింగ్ గురించి చర్చించేదని.. తను సూపర్ కూల్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది.

ఇక నెక్స్ట్ జనరేషన్‌లో తను చేసిన మోడల్ షోనాల్ గుజ్రల్ పాత్రకు ఎవరూ సరిపోరని తెలిపిన కంగన.. గత జనరేషన్‌లో నర్గీస్ దత్ ఈ పాత్రకు 100 శాతం న్యాయం చేయగలదని అభిప్రాయపడింది.

Tags:    

Similar News