మేము సైతం.. ఒకే రోజు వెయ్యి మొక్కలు నాటిన పోలీసులు

దిశ, సత్తుపల్లి : నిత్యం ప్రజాసమస్యల పరిష్కారంలో, శాంతి భద్రతల పర్యవేక్షణలో బిజీగా ఉండే పోలీసులు మేము సైతం అంటూ ఒకే రోజు 1000 మొక్కలు నాటి సమాజం పట్ల వారికున్న బాధ్యతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణ సీఐ రమాకాంత్ మాట్లాడుతూ.. 7వ విడత హరితహారంలో భాగంగా సత్తుపల్లి రేంజ్ అటవీశాఖ వారి సహకారంతో ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్, ఏసీపీఎన్ వెంకటేష్‌ల ఆదేశానుసారం సత్తుపల్లి పట్టణ సీఐ రమాకాంత్, ట్రైనీ ఎస్ఐ […]

Update: 2021-10-02 08:53 GMT

దిశ, సత్తుపల్లి : నిత్యం ప్రజాసమస్యల పరిష్కారంలో, శాంతి భద్రతల పర్యవేక్షణలో బిజీగా ఉండే పోలీసులు మేము సైతం అంటూ ఒకే రోజు 1000 మొక్కలు నాటి సమాజం పట్ల వారికున్న బాధ్యతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణ సీఐ రమాకాంత్ మాట్లాడుతూ.. 7వ విడత హరితహారంలో భాగంగా సత్తుపల్లి రేంజ్ అటవీశాఖ వారి సహకారంతో ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్, ఏసీపీఎన్ వెంకటేష్‌ల ఆదేశానుసారం సత్తుపల్లి పట్టణ సీఐ రమాకాంత్, ట్రైనీ ఎస్ఐ రామునాయక్‌లు సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఖాళీ స్థలంలో అర్బన్ పార్క్ లో 1000 మొక్కలను నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ముత్యాల రావు, ఏఎస్ఐ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News