వారి ప్రయత్నాలను సాగనివ్వం..

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రజల ఇష్టాన్ని తారుమారు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అన్నారు. డెలావర్ రాష్ట్రంలో ఓ సభలో ప్రజలనుద్దేశించి కమలా హ్యారీస్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ పై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాలో గతంలో ఏ అధ్యక్షునికి రానన్ని ఓట్లు జోబైడెన్‌కు వచ్చాయని అన్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు రికార్డు స్థాయిలో 7.5 కోట్ల ఓట్లు వచ్చాయని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు ప్రజాభీష్టాన్ని […]

Update: 2020-11-11 06:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రజల ఇష్టాన్ని తారుమారు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అన్నారు. డెలావర్ రాష్ట్రంలో ఓ సభలో ప్రజలనుద్దేశించి కమలా హ్యారీస్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ పై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాలో గతంలో ఏ అధ్యక్షునికి రానన్ని ఓట్లు జోబైడెన్‌కు వచ్చాయని అన్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు రికార్డు స్థాయిలో 7.5 కోట్ల ఓట్లు వచ్చాయని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు ప్రజాభీష్టాన్ని తారుమారు చేసే కుఠిల ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వాటిని తాను, అధ్యక్షుడు జో బైడెన్ సాగనివ్వబోమని ఆమె తెలిపారు.

Tags:    

Similar News