తమిళనాట మ్యానిఫెస్టో లొల్లి.. కమల్ VS స్టాలిన్
దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాట రాజకీయం హీటెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా పార్టీల వారీగా పొత్తులు, అధికార పార్టీని ఢీ కొట్టేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేసే బిజీలో అక్కడి నేతలు మునిగిపోయారు. ఒక్కసారి అవకాశమిస్తే మీకోసం అది చేస్తాం, ఇది చేస్తాం అనే వాగ్దానాలను ఇప్పటి నుంచే లీడర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తమిళనాట ప్రస్తుతం కూటముల జోరు బాగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్ని్కల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేపట్టాలని జాతీయ […]
దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాట రాజకీయం హీటెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా పార్టీల వారీగా పొత్తులు, అధికార పార్టీని ఢీ కొట్టేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేసే బిజీలో అక్కడి నేతలు మునిగిపోయారు. ఒక్కసారి అవకాశమిస్తే మీకోసం అది చేస్తాం, ఇది చేస్తాం అనే వాగ్దానాలను ఇప్పటి నుంచే లీడర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తమిళనాట ప్రస్తుతం కూటముల జోరు బాగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్ని్కల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేపట్టాలని జాతీయ పార్టీలతో పాటు లోకల్ పార్టీలు సైతం ఉవ్విళ్లురుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్, డీఎంకే.. అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల మధ్య సీట్ల పంచాయితీలు ఓ కొలిక్కి రాగా, అటు కమల్‌హాసన్, శరత్‌కుమార్ కూటమి ఈసారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. ఇదిలాఉండగా, తాజాగా కొత్త అంశం తెరమీదకు వచ్చింది. తమ పార్టీ మ్యానిఫెస్టోను డీఎంకే పార్టీ కాపీ కొట్టిందని కమల్ హాసన్ ఆరోపించారు. ఇటీవల స్టాలిన్ మ్యానిఫెస్టోను ప్రకటించగా ‘మక్కల్ నిధి మయ్యమ్’ పార్టీ హామీలు అందులో ఉన్నాయని కమల్ తప్పుబట్టారు. మహిళలకు ఆర్థిక సాయం చేస్తానని ముందే చెప్పినట్లు.. యంత్రాలతో పారిశుధ్య పనులు తమ ఆలోచనే అని.. ఐదేళ్లలో 50లక్షల ఉద్యోగాల కల్పన మా ఉద్దేశమని కమల్ చెప్పుకొచ్చారు.