పండు ముసలమ్మలకు ‘కళ్యాణ లక్ష్మి’ డబ్బులు!

దిశ, డైనమిక్ బ్యూరో : పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణలక్ష్మి పథకం కొందరి చేతివాటంతో పక్కదారి పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అర్హులకు కాకుండా ఇతరులకు కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల పెళ్లి అయి పిల్లలు పుట్టినా కూడా కళ్యాణ లక్ష్మి డబ్బులు అందడం లేదు. కానీ, ఆదిలాబాద్ జిల్లాలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఇచ్చోడ మండలానికి చెందిన 70 ఏళ్ల గంగుబాయికి కళ్యాణ […]

Update: 2021-12-13 05:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణలక్ష్మి పథకం కొందరి చేతివాటంతో పక్కదారి పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అర్హులకు కాకుండా ఇతరులకు కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల పెళ్లి అయి పిల్లలు పుట్టినా కూడా కళ్యాణ లక్ష్మి డబ్బులు అందడం లేదు. కానీ, ఆదిలాబాద్ జిల్లాలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఇచ్చోడ మండలానికి చెందిన 70 ఏళ్ల గంగుబాయికి కళ్యాణ లక్ష్మికి చెందిన డబ్బులు రెండు సార్లు అందాయి.

పదేళ్ల క్రితమే భర్త చనిపోయిన పండు ముసలమ్మ అకౌంట్లో డబ్బులు జమ చేయడం చోద్యంగా ఉందని స్థానికులంతా అవాక్కయ్యారు. ఎలాంటి ఎంక్వైరీ లేకుండా గంగూబాయి అకౌంట్లో డబ్బులు వేయడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలా ఆదిలాబాద్ జిల్లాలోనే ముగ్గురు ముసలమ్మలకు కళ్యాణ లక్ష్మి డబ్బులు జమ కావడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే ఆ పథకం ఎంత పటిష్టంగా అమలు అవుతుందో ఇట్టే తెలిసిపోతోంది.

Tags:    

Similar News