కాళేశ్వరం 15 రోజుల లాక్ డౌన్…?

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ వసంత ఆలయ ఈఓకు లేఖ కూడా రాశారు. సెకండ్ వేవ్ తో గ్రామంలో 50 మంది వరకు కరోనా బాధితులు ఉన్నారని ఈ పరిస్థితుల్లో స్వీయ నిర్భందం పాటించక తప్పని సరి పరిస్థితి ఏర్పడిందన్నారు. కంటైన్ మెంట్ జోన్ గా ఏర్పాటు చేసుకుని స్వీయ నిర్భందం పాటించక తప్పని పరిస్థితి తయారైందని […]

Update: 2021-04-25 10:03 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ వసంత ఆలయ ఈఓకు లేఖ కూడా రాశారు. సెకండ్ వేవ్ తో గ్రామంలో 50 మంది వరకు కరోనా బాధితులు ఉన్నారని ఈ పరిస్థితుల్లో స్వీయ నిర్భందం పాటించక తప్పని సరి పరిస్థితి ఏర్పడిందన్నారు.

కంటైన్ మెంట్ జోన్ గా ఏర్పాటు చేసుకుని స్వీయ నిర్భందం పాటించక తప్పని పరిస్థితి తయారైందని సర్పంచ్ ఆ లేఖలో వివరించారు. ఇప్పటికే గోదావరి తీరంలో పూజలు చేయవద్దని బ్రాహ్మణ సంఘం, నాయి బ్రాహ్మణులు కూడా తమ విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఆలయంలో కూడా 15 రోజుల పాటు పూజలు నిలిపివేసి, భక్తుల రాకపోకలు లేకుండా చూడాలని సర్పంచ్ వసంత కోరారు.

Tags:    

Similar News